Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బ్యాంకు ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27న ఒక్కరోజు సమ్మెకు పిలుపు ఇస్తున్నట్టు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) తెలిపింది. బుధవారం ముంబయిలో జరిగిన యూఎఫ్‌బీయూ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐదు రోజుల బ్యాంకింగ్‌ను అమలల్లోకి తేవాలనీ, పెన్షన్‌ను పునరుద్ధరించాలనీ, నేషనల్ పెన్షన్ స్కీంను రద్దు చేయాలనీ, వేతన సవరణ చేయాలనే పలు డిమాండ్లతో ఈ సమ్మెకు పిలుపు ఇస్తున్నట్టు యూఎఫ్‌బీయూ బాధ్యులు సంజీవ్ కే బంద్లిష్ తెలిపారు.