Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసును ఏడు రోజుల పాటు సాగదీసి పోలీసులు చివరకు నీరుగారుస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ విమర్శించారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాటలు చూస్తుంటే నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుందని చెప్పారు. వారిని బాధితురాలు గుర్తు పట్టడం లేదనే సాకు చూపించి ఆకేసును తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. వీడియో, ఫోటోలు స్పష్టంగా బయటకు వచ్చాక ఇంకేం ఆధారాలు కావాలని ప్రశ్నించారు. దిగజారిన పోలీసు వ్యవస్థకు ఇది నిదర్శనమన్నారు. దిశ కేసులో రాత్రికి రాత్రి పట్టుకుని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు...ప్రస్తుత గ్యాంగ్ రేపును ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు.