Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఐఎం, టీఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి ఆగ్రహం
- సీవీ ఆనంద్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు
- నిందితులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు:
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నటే, హత్య ల్లోనూ పొత్తులు పెట్టుకున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. 'పొత్తు ల్లో భాగస్వాములు, ఎన్నికల్లో భాగస్వా ములు, ప్రభుత్వంలో భాగస్వాములు చివరికి రేప్‌లు, మర్డర్లలో కూడా భాగస్వాములయ్యారు' అనిఎద్దేవా చేశారు. అందుకే నిందుతులను రక్షిం చేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్‌పై ఆయన అల్లిన కథ రక్తి కట్టలేదన్నారు. మైనర్ బాలికపై జరిగిన లైగింకదాడి కేసులో కీలక విషయాలను పోలీసులు దాచి పెడుతు న్నారని ఆరోపించారు. అమెరికా పర్యటన ముగించుకుని దేశానికి చేరు కున్న రేవంత్...బుధవారం ఢిల్లీలో పార్టీ నేత మల్లు రవితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ కేసులో వాహన యజమానుల వివరాలను సీపీ ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. వారిని ఎందుకు కాపా డాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్యాంగ్ రేప్‌కు సంబం ధించిన కార్ల యజమానులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మోటర్ వాహన చట్టం 133 ప్రకారం యజమానులకు నోటీసులు ఇచ్చి, వారిని పోలీస్ స్టేషన్‌కు ఎందుకు రప్పించలేదన్నారు. వాస్తవాలు, వివరాలు తెలియజేసి కేసు నమోదు చేయాలని కోరారు. బెంజికారు పబ్ వరకు వెళ్లిన తర్వాత ఇన్నోవాలో బయల్దేరారని సీపీ చెప్పారనీ, ఈ కేసులోబాధితులు, నిందితులు ప్రయాణించిన బెంజి, ఇన్నోవా కార్లే కీలక ఆధారాలని పేర్కొన్నారు. ఈ కారులో ఉన్నవారు మైనర్లు అని చెబుతున్నారనీ, మైనర్లు వాహనాలు నడిపినప్పుడు యజ మానులకు వాహనాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఘటనకు సంబంధించిన వాహనాలు ఎక్కడివి? వావాహనాల యజమానుల మీద తీసుకున్న చర్యలేమిటో చెప్పకుండా సీపీ కప్పి పుచ్చారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఎంపిక చేసిన వక్ఫ్‌బోర్డు ఛైర్మెన్్ తోపాటు ఎంఐఎం అధ్య క్షులు అసదుద్దీన్ ఒవైసీ తమ సొంత పార్టీ ఎమ్మెల్యే కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బెంజికారు ఎంఐఎంకు సంబంధించిన వారిదనే ఆరోపణలు వస్తున్నప్ప డు సీపీ మెర్సిడీస్ బెంజికారు యజమాని ఎవరో చెప్పలేదన్నారు. ఈ ఘటనలో ఉపయోగించిన కారు యజమానులను పోలీసులు పిలిచి విచారించారా? లేదా? అని ప్రశ్నించారు. మైనర్లు కార్లు నడపకపోతే ఘటనకు సహకరించిన వాహనాల యజమానులపై కూడా పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 'ఘటన జరిగిన తర్వాత ఏడు రోజుల పాటు ఇన్నోవా కారు ఎక్కడుంది? ఆ కారుపై ఉన్న ప్రభుత్వ స్టిక్కర్ తొలగించారు. రేప్ ఘటనతో పాటు ఉద్దేశపూర్వకంగా ఆధారాలు చెరిపే ప్రయత్నం చేశారు. వాహనాన్ని ఎక్కడ స్వాధీనం చేసుకున్నారో పోలీసులు వెల్లడించలేదు' అని రేవంత్ విమర్శించారు.