Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న హైదరాబాద్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
హైదరాబాద్ : 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు' జరపాలని నిర్ణయించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు భారత్‌లోని అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంకు ఇందులో భాగమైంది. ఈ మేరకు ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రా, పీఎం స్వనిధి, సహాయక బృందాలకు లోన్లను, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి లో ఆర్థిక అవసరాలను తీర్చే రూ. 57.63 కోట్ల విలువైన ఇతర రిటైల్ అసెట్స్‌ను హైదరాబాద్ జోన్ ఇండియన్ బ్యాంకు జోనల్ మేనేజర్ చంద్ర ప్రకాశ్ పంపిణీ చేశారు. కాగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్-ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్ ఈనెల 12 వరకు కొనసాగనున్నది.