Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంక్ సర్కిల్ హెడ్ ప్రసాద్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్ : ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) హైదరాబాద్‌లో ఖాతాదారుల చైతన్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ఆ బ్యాంక్ సర్కిల్ హెడ్ ఎన్విఎస్ ప్రసాద్ రెడ్డి హాజరై మాట్లాడుతూ 'ఐకానిక్ వీక్' ఉత్సవాల్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశామన్నారు. తమ బ్యాంక్ ఎప్పుడూ ఖాతాదారులను గౌరవిస్తుం దన్నారు. నేటి ఆధునిక బ్యాంకింగ్ యుగంలో తమ మొబైల్ బ్యాంకింగ్ అప్లి కేషన్ 'పీఎన్బీ వన్' అత్యంత భద్రతతో కూడుకున్నదన్నారు. తమ బ్యాంక్ ఇంటి వద్దకే అనేక సేవలను అందిస్తుందన్నారు. సైబర్ నేరాల పట్ల తమ ఖాతాదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమా నికి పీఎన్బీ అధికారులు, సిబ్బందితో పాటు ఖాతాదారులు హాజరయ్యారు.