Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఆర్టీసీ, బస్పాస్ ఛార్జీలను పెంచడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులు, హైదరాబాద్లో విద్యార్థులు అనేక ఆర్థిక ఇబ్బందులతో చదువుకుంటున్నారని తెలిపారు. పెంచిన ఈ భారం వల్ల అనేక మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పటికే ఫీజులు పెంచి విద్యార్థులపై భారం మోపాయని విమర్శించారు. బస్పాస్ ఛార్జీల పెంపు నుంచి విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఛార్జీలు పెంచడం వల్ల ప్రజారవాణాకు ప్రజలు దూరమయ్యే అవకాశముందని తెలిపారు. రవాణా వ్యవస్థను నష్టాల నుంచి పూడ్చాలనే పేరుతో ప్రజలకు దూరం చేసే కుట్రలను ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు.