Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ మధ్య రైల్వే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైల్వే టికెట్లను సజావుగా అందించటంతోపాటు ప్రయాణీకులకు సంతృప్తికరమైన సేవలను ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్ ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా యూటీఎస్ మొబైల్ యాప్ గురించి ప్రయాణీకులకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఈ యాప్ను ఉపయోగించి అన్ రిజర్వ్డ్ టికెట్లను సులభరీతుల్లో కొనటం ఎలా...? అనే అంశంపై గురువారం సికింద్రాబాద్లోని సంచాలన్ భవన్లో సెమినార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యాప్ ద్వారా రైల్వే బుకింగ్ కౌంటర్లను సంప్రదించాల్సిన అవసరం లేకుండానే ప్రయాణీకులు తమ మొబైల్ ద్వారా సౌకర్యవంతంగా టికెట్లను పొందొచ్చని తెలిపారు.