Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే కార్డులు మంజూరు చేస్తాం : మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పనులు పూర్తయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ క్రమంలో ఆ రెండు జిల్లాల్లో త్వరలోనే అందరికీ సంబంధిత కార్డులను అందజేస్తామని ఆయన వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లోని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ములుగులో 202 టీఎంల రక్త నమూనాలను సేకరించామని తెలిపారు. ఈ క్రమంలో 1,81,540 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 244 టీఎంల రక్త నమూనాలను సేకరించామనిన్నారు. అక్కడ 3,38,761 మందికి వైద్య పరీక్షలు చేశామని వెల్లడించారు.