Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సీపీఐ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి జహీరాబాద్ మున్సిపాలిటీకి సత్వరం ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సయ్యద్ జలాలుద్దిన్ గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పాలకవర్గ కాలపరిమితి 2018లో పూర్తయిందనీ తెలిపారు. పట్టణ శివారు గ్రామాలైన పస్తాపూర్, రంజోలు, అల్లిపూర్, చిన్న హైదరాబాద్ మేజర్ గ్రామపంచాయతీలతోపాటు చిన్న హోతి గ్రామాన్ని మున్సిపాల్టీలో విలీనం చేశారని పేర్కొన్నారు. అయితే.. ఆ గ్రామాన్ని విలీనం చేయోద్దంటూ ఆ గ్రామస్తులు హైకోర్టుకు వెళ్లారనీ తెలిపారు. హైకోర్టు ఆ గ్రామంతో కలిపి జహీరాబాద్ మున్సిపాల్టీకి ఎన్నికలు నిర్వహించాలని 2022 జనవరి 27న హైకోర్టు తీర్పును వెలువరించిందని గుర్తుచేశారు. ఈ తీర్పును అనుసరించి తక్షణం ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ నేతలు విజ్ఞప్తి చేశారు.