Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ లేఖ రాశారు. ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్రంలోని రైతుల కంట కన్నీరు..కేసీఆర్ ఫామ్‌హౌస్ పంట పన్నీరుగా మారిందని విమర్శించారు. వరిసహా 14 పంటలకు కనీస మద్ధతు ధరను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపట్ల ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
ఎందుకు ఆలస్యమైంది? : తరుణ్‌చుగ్
జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక లైంగికదాడి జరిగింది ప్రభుత్వ వాహనంలోనేనని గుర్తించడానికి పోలీసులకు ఎందుకు ఆలస్యమైందని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ ప్రశ్నించారు.
ముఖ్యనేతలతో బండి భేటీ
హైదరాబాద్‌లో జూలై 3,4 తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ కోసం వేసిన కమిటీల ముఖ్యనేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ గురువారం భేటీ అయ్యారు.