Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీభవన్‌కు రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం గాంధీభవన్‌కు వచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కండువాలు, శాలువాలతో ఆయనకు ఆహ్వానం పలికారు. మృగశిర కార్తె సందర్భంగా పీసీసీ ఫిషర్మెన్ కమిటీ చైర్మెన్‌్ మెట్టుసాయికుమార్ బెస్తవారి వల, టోపీ, బుట్ట,చేపలను రేవంత్‌కు బహూకరించారు. అనంతరం పలువురు నాయకులతో రేవంత్ భేటీ అయ్యారు.
మాలవత్ పూర్ణ, మిథాలీరాజ్‌కు అభినందనలు
'చిరు గుట్టల గ్రామమైన పాకాల నుంచి వచ్చి, అన్ని ఖండాల్లోని అతి ఎత్తైన పర్వతాలను అధిరోహించి, తెలంగాణ కీర్తి పతాకాన్ని ప్రపంచ నలువైపులా ఎగరేసిన మన గిరిజన బిడ్డ మాలవత్ పూర్ణకు మనస్ఫూర్తిగా అభినందనలు' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 'నీ ప్రయాణం ఎందరో యువతకు ఆదర్శం. తెలంగాణకు గర్వకారణం..! ఆటతో, నాయకత్వంతో, అంతకుమించిన వ్యక్తిత్వంతో, భారత అతివల క్రికెట్‌కు విశేష సేవలందించి, ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచి ఆటకు వీడ్కోలు పలికిన మిథాలిరాజ్ అభినందనలు' అని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. 'మీరు ఆటను విడిచినా, మీ సేవల్ని ఆట మరవదు' అని పేర్కొన్నారు.
అరెస్టు అప్రజాస్వామికం : అన్వేష్‌రెడ్డి
మంత్రి కేటీఆర్ మెట్ పల్లికి వస్తున్న సందర్బంగా కిసాన్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని కిసాన్ కాంగ్రెస్ అద్యక్షులు సుంకేట అన్వేష్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెరుకు పరిశ్రమ కేటీఆర్ మంత్రిత్వశాఖలో ఉంది కాబట్టి చెరుకు ఫ్యాక్టరీ తెరవాలని అడగడం తప్పా ?అని ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక ముందస్తు అరెస్ట్ చేయడం దారుణమని విమర్శించారు.
నేడు పరిగిలో డిజిటల్ మెంబర్షిప్ కార్డు ఆవిష్కరణ
రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మెంబెర్షిప్ పూర్తయిన నేపథ్యంలో సభ్యులకు డిజిటల్ కార్డులు పరిగి పట్టణంలో తొలిసారి ఇవ్వనున్నట్టు డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి జాతీయ నేతలు హాజరు అవుతున్నట్టు తెలిపారు.