Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి
నవతెలంగాణ-హనుమకొండ
జక్కులొద్దిలో గుడిసెలు వేసుకున్న పేదలపై దౌర్జన్యం చేసిన వారిని అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు ధరావత్ భానూనాయక్తో కలిసి చక్రపాణి మాట్లాడారు. కొద్ది రోజులుగా జక్కులొద్ది గుడిసెవాసులపై భూఆక్రమణదారులు, రియల్టర్లు రౌడీలతో దాడులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గుడిసెవాసులకు పట్టాలిచ్చి పక్కా ఇండ్లు కట్టించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయకులపై బనాయించిన తప్పుడు కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎం.చుక్కయ్య, వల్లెపు రాజు, జగన్, శ్రీనివాస్, స్వరూప, ప్రసన్నకుమారి, కవిత, కొమురెల్లి, తిరుపతి, సీతారామ్, లావుడ్య రంగ, భుక్యా తిరుపతి, రవి తదితరులు పాల్గొన్నారు.