Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ, సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ సొసైటీల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాల సిబ్బందికి బదిలీలు నిర్వహించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కె జంగయ్య, చావ రవి గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2021 జూన్ నుంచి సెప్టెంబర్ లేదా పీఆర్సీ అమలు తేదీ వరకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని సొసైటీల్లో ఒకే పనివేళలు అమలు చేయాలనీ, ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం తగ్గించాలని కోరుతూ ఆయా సొసైటీల కార్యదర్శులకు వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ ఆదనపు కార్యదర్శి హనుమంతు నాయక్, జాయింట్ సెక్రటరీలు పార్వతి, శారద, ఓఎస్డీ చంద్రకాంత్, బీసీి సొసైటీ డిప్యూటీ సెక్రటరీ మంజుల తదితర అధికారులతో చర్చించారు. జూన్ నెలాఖరులోగా సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి దశలవారీ ప్రత్యక్ష పోరాట కార్యక్రమం చేపడతామని వారు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి టి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.