Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదకొండు రోజులైనా జమ కాని పరిస్థితి
- కేంద్రంపెండింగ్ నిధులివ్వకపోవడంతో ఆలస్యం
- పచ్చనిపొలాల్లో రియల్ఎస్టేట్పై సర్వే
- బంధుపై పరిమితులు విధింపు?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వానాకాల సీజన్ ప్రారంభమైంది. పంట పెట్టుబడి కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ప్రతిసారి జూన్ మొదటివారంలో టెన్షన్‌గా రైతు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యేవి. పదకొండు రోజులైనా ఆ డబ్బుల ఉసేలేకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతున్నది.
తొలకరి పలకరించేందుకు సిద్ధం
ఆకాశం మబ్బులు పడి తొలకరి జల్లు పలకరించేందుకు సిద్ధమవుతున్నది. మరోవైపు అన్నదాత చేతుల్లో పెట్టుబడి లేదు. ఈ క్రమంలో రైతు బంధైనా ఆదుకుంటుదనుకుంటే, అది కూడా ఆలస్యమవుతుందని రైతులు వాపోతున్నారు. విత్తనానికి భూమిని సదును చేసుకోవడం, దుక్కులు దున్నడంతోపాటు విత్తనాలు, ఎరువులు ఇతరత్రా పరికరాలు సిద్ధం చేసుకునే పనిలో రైతులు నిమగమై ఉన్నారు. ఈ నేపథ్యంలో గంపెడాశలు పెట్టుకున్న రైతులు... ప్రభుత్వం పెట్టుబడి ఇంకా అందకపోవడంతో రైతులు దిగులుగా ఉన్నారు. ఈ సీజన్లో 72 లక్షల ఎకరాల్లో పత్తి, 63 లక్షల ఎకరాల్లో వరి, 22 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, మరో 10 లక్షల ఎకరాల్లో కందులు, సోయాబీన్ తదితర పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. రాష్ట్రంలో దాదాపు 66.61 లక్షల మంది రైతులు రైతుబంధు పొందుతున్నారు. 1.48కోట్ల ఎకరాల సాగుభూమికి ఈ పెట్టుబడి సాయం అందుతుంది. ఈ పరిస్థితుల్లో రైతుబంధు ఆలస్యం కావడం పట్ల ప్రభుత్వం, ఉన్నతాధికారులు భిన్నమైన కారణాలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో పెట్టుబడి సాయం ఆలస్యమవుతుందని రైతు సంఘాలు అంటున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల ఆలసత్వం
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులు, గ్రాంట్లు, అప్పులకు వెసులుబాటు కల్పించకపోవడంతో రైతుబంధు వెనుకాముందు అవుతున్నదని చెబుతున్నారు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు కొరత వెంటాడుతున్నదనేది సుస్పష్టం. రైతు బంధు ఆలస్యం కావడానికి మరో కారణం చెబుతున్నారు. రైతు బంధు పొందుతున్న లబ్దిదారుల్లో అత్యధిక భూమి కలిగిన చాలా మంది పంట పొలాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వందలాది ఎకరాల్లో రియల్ ఎస్టేట్‌గా చేస్తున్నారు. ప్లాట్లు అమ్ముకుంటున్నారు. అటువంటి భూములకు సైతం రైతుబంధు వస్తుందని ప్రభుత్వానికి ఫిర్యాదు అందాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని అలాంటి పంట పొలాలను సర్వే చేస్తున్నట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ చుట్టు రంగారెడ్డి, మేడ్చెల్, సంగారెడ్డి, యాదాద్రిభువనగిరి, వికరాబాద్ ప్రాంతాల్లో పంటపొలాల్లో ఈ వ్యాపారం చేస్తున్నారు. అటువంటి భూములకు రైతు బంధు కట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం చేపట్టిన సర్వే ఆధారంగా రైతు బంధు పథకానికి పరిమితులు విధించే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఎకరా నుంచి వందల ఎకరాల భూమి ఉన్న వారికి రైతు బంధు అందుతుంది. దీంతోపాటు ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. దీన్నుంచి బయటపడేందుకు రైతుబంధుకు పరిమితి విధించి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.