Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నియంత్రణపై చేతులెత్తేసిన టీఆర్ఎస్ సర్కారు
- పత్తాలేని మంత్రివర్గ ఉపసంఘం
- ఎల్లుండి నుంచే బడులు ప్రారంభం
- ఫీజు బాదుడు షురూ...
- విచ్చలవిడిగా విద్యావ్యాపారం
- ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ల ఇష్టారాజ్యం
- పుస్తకాలు, యూనిఫార్మ్ మా వద్ద కొనాల్సిందే
- నిబంధనలకు యధేచ్చగా తిలోదకాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలలు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేకంగా చట్టం తెస్తాం. 2022-23 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఈ చట్టం తేవాలి. విధివిధానాల రూపకల్పన కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నాం. మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం చేయాలి'అని జనవరి 17న మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. మార్చిలో ఆ కమిటీ సమావేశమై ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ గతంలో చేసిన ప్రతిపాదనలపైనే చర్చించి కొన్నింటిని ప్రభుత్వానికి పంపించింది. ఏటా పదిశాతం ఫీజులు పెంచుకోవచ్చని సూచించింది. అయినా ఫీజుల చట్టంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఫీజుల నియంత్రణ చట్టంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
'ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం నియమించిన తిరుపతిరావు కమిటీ సైతం చట్టం తేవాలని సూచించింది. ఫీజులను నియంత్రించా లంటూ వైఎస్ హయాం నుంచి ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. దీనిపై సర్కారు జీవో ఇస్తే ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి స్టే తెస్తున్నాయి. చట్టం వస్తేనే ఫీజులను నియంత్రించడం వీలవుతుంది.'అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటి నుంచే రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాల ఫీజు బాదుడు ప్రారంభమైంది. ఎల్లుండి (సోమవారం) నుంచి రాష్ట్రంలతో బడులు పున:ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో 2020-21, 2021-22 రెండు విద్యాసంవత్సరాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచొద్దంటూ ప్రయివేటు విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కలిపి ఫీజులు పెంచుతున్నాయంటూ తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల, ఆ ప్రాం తాన్ని బట్టి 10 నుంచి 30 వరకు ఫీజులు పెంచి తల్లిదండ్రులపై మోయలేని భారం మోపుతు న్నాయి. గతేడాది ఫీజులను ఇప్పుడు పెంచిన ఫీజులను చూసి తల్లడిల్లిపోతున్నారు. విచ్చలవిడిగా విద్యావ్యాపారం సాగుతున్నది. ప్రయివేటు, కార్పొరే ట్ యాజమాన్యాలు యధేచ్చగా ఫీజు దోపిడీకి పాల్ప డుతున్నాయి. ఇక అంతర్జాతీయ పాఠశాలల్లో ఫీజు లు రూ.లక్షల్లో ఉంటున్నాయి. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఇంటర్నే షనల్ స్కూల్లో ఎల్కేజీ ఫీజు రూ.2.50 లక్షలు ఉందంటే అతిశయోక్తి కాదు. బస్సు కిరాయి, పుస్తకాలు, యూనిఫామ్స్‌కు అదనం గా చెల్లించాలి. ఏసీ తరగతి గదులు, డిజిటల్ తర గతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లంటూ అందినకాడి కి దోచుకుంటున్నాయి.
ఇంకోవైపు నిబంధనలకు తిలోదకాలిస్తు న్నాయి. ట్యూషన్ ఫీజుకు అదనంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, షూస్, ఇతర సామాగ్రి వారి వద్దే కొనాలంటూ యాజమాన్యాలు హుకుం జారీ చేస్తు న్నాయి. బస్సు ఛార్జీలు వాటికి అదనం. ఇవన్నీ కలిపి ఫీజు చెప్తుండడంతో తల్లి దండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో జనవరిలో నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో కొత్త చట్టం తెస్తామంటూ ప్రభుత్వం హడావుడి చేసింది. మార్చిలో మంత్రివర్గ ఉపసంఘం సమావే శమైంది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమ నార్హం. దీంతో ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముకాస్తుందన్న ఆరో పణలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే ఫీజుల చట్టంపై నిర్ణయం తీసుకోలేదంటూ పలువురు విమర్శిస్తున్నారు.
అమలుకు నోచుకోని జీవోలు
రాష్ట్రం ఆవిర్భవిస్తే కార్పొరేట్ విద్యావ్యవస్థను నియంత్రిస్తామని నాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించా రు. తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లయినా కార్పొరేట్ విద్యారంగాన్ని నియంత్రించకపోగా ప్రోత్సహించిం దన్న విమర్శలొచ్చాయి. ఇంకోవైపు ఫీజుల నియం త్రణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదు. జిల్లా ఫీ రెగ్యులేటరీ కమిటీ (డీఎఫ్ఆర్సీ)ని ఏర్పాటు చేస్తూ జీవోనెంబర్ 91ని 2009, ఆగస్టు 6న ఉమ్మడి ఏపీ ప్రభుత్వం తెచ్చింది. దీనిపై తల్లిదండ్రులు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. రూ.12 వేలలోపు ఫీజు ఉన్న పాఠశాలలు డీఎఫ్ఆర్సీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని జీవోనెంబర్ 91ని సడలిస్తూ మరో జీవో మూడును జారీ చేసింది. ప్రయివేటు పాఠశా లలు ఫీజును నియంత్రించాలనీ, క్యాపిటేషన్ ఫీజు రద్దు చేయాలనీ, కనీస ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం జీవోనెంబర్ 42ను 2010, జూలై 30న విడుదల చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ ప్రయివేటు పాఠశాలల యాజమా న్యాలు కోర్టును ఆశ్రయించాయి. దాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఫీజులు తగ్గించాలని తల్లిదండ్రులు పెద్దఎత్తున ఉద్యమించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తిరుపతిరావు నేతృత్వంలో 2017లో ప్రత్యేకంగా కమిటీని నియమించింది. నివేదిక ఇచ్చినా, ఆ సిఫా రసులను ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. జీవో నెంబర్ 1 ప్రకారం ప్రతి పాఠశాలలోనూ గవర్నింగ్ బాడీ ఉండాలి. ప్రయి వేటు విద్యాసంస్థలు ఐదు శాతం మాత్రమే లాభాలు పొందాలి. ఈ జీవో ఎక్క డా అమలు కావడంలేదు. ఇలా ప్రభుత్వాలు తెచ్చిన జీవోలను కొన్నింటిని కోర్టు లు కొట్టివేస్తే, మరికొన్ని అమలు కావడం లేదు. ఏదే మైనా తల్లిదండ్రులపైనే ఫీజు భారం పడుతున్నది.
తల్లిదండ్రులు పోరాటాల్లోకి రావాలి : నాగటి నారాయణ, టీపీఏ అధ్యక్షులు
తల్లిదండ్రుల పోరాటాలు అత్యవసరం. ఈ ప్రభుత్వానికి ఫీజులను నియంత్రించే ఉద్దేశం లేన్న ట్టుగా తేలింది. తిరుపతిరావు కమిటీ నివేదికపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మంత్రివర్గాన్ని నియమించినా ఏమీ తేల్చలేదు. ఫీజులను నియంత్రి స్తామంటూ ప్రభుత్వం నటిస్తున్నది తప్ప ఆచరణలో ఏమీ చేయడం లేదు. ప్రయివేటు, కార్పొరేట్ యాజ మాన్యాల ఒత్తిడికి తలొగ్గి వెనకడుగు వేస్తున్నది. తల్లిదండ్రుల పోరాటం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. అన్ని సంఘాలనూ కలుపుకుని ఐక్య ఉద్యమాలు నిర్మిస్తాం.
టీఏఎఫ్ఆర్సీ తరహాలో కమిటీని నియమించాలి : టి నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి
ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సుల ఫీజుల కోసం టీఏఎఫ్ఆర్సీ తరహాలోనే ప్రయివేటు పాఠశా లల ఫీజుల నియంత్రణకు ప్రత్యేకంగా కమిటీని ని యమించాలి. కలెక్టర్ చైర్మెన్‌గా ఆ కమిటీ లుండాలి. పాఠశాల గవర్నింగ్ బాడీలో చర్చించి నిర్ణయం తీసు కుని ఆ కమిటీకి ప్రతిపాదనలు పంపాలి. ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించకూడదు. డొనేషన్ల కట్టడీకి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి.
టీచర్లకు కనీస వేతనాలివ్వడం లేదు : సంతోష్‌కుమార్, టీఎస్టీసీఈఏ అధ్యక్షులు
రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థ లు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కానీ వాటిలో పనిచేసే టీచర్లకు, బోధనేతర సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో మానసికం గా, ఆర్థికంగా టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. కరోనా నేపథ్యంలో రెండేండ్లుగా సరిగ్గా జీతాల్లేక అప్పుల పాలయ్యారు. ఇలాంటి సమయంలో విద్యా ర్థులకు నాణ్యమైన విద్య అందడం సాధ్యమేనా?. ప్రభుత్వం ఈ విషయాలపైనా నిఘా పెట్టాలి.