Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
బస్ పాస్ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బస్‌పాస్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా వందలాది మంది విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. రవి అధ్యక్షతన జరిగిన సభలో నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ పాస్ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్చి నెల నుంచి నేటి వరకు మూడుసార్లు బస్‌చార్జీలు పెంచడం సరైనది కాదన్నారు. మొత్తం బస్ చార్జీలు, బస్ పాస్ చార్జీలు 150 శాతం పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ సెస్ పేరుతో 5 రూపాయలు, జనరల్ బస్ పాస్ చార్జీలు రూ. 165 నుంచి రూ. 400, ఐదు కిలోమీటర్ల వ్యవధి దూరం ఉన్న విద్యార్థుల బస్ పాస్ చార్జీలు రూ. 115 నుంచి రూ. 150 వరకు, 35 కిలోమీటర్ల వ్యవధి దూరం గల విద్యార్థుల బస్‌పాస్ చార్జీలు రూ. 335 నుంచి రూ. 550 వరకు పెంచారని వివరించారు. ఈ స్థాయిలో చార్జీల పెంపు పేదలు, గ్రామీణ ప్రాంత బడుగు, బలహీన వర్గాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తక్షణమే చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్ వర్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు శంకర్, పూజ, మిశ్రీన్, ప్రశాంత్, సాయి రాష్ట్ర కమిటీ సభ్యులు వీరభద్రం, భూపేందర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులపై భారం తగదు : పీడీఎస్‌యూ
టీఎస్ ఆర్టీసీ నెల రోజుల వ్యవధిలో విద్యార్థుల బస్‌పాస్‌ల చార్జీలను మూడుసార్లు పెంచిందనీ, అది చాలదన్నట్టుగా బస్సు సెస్ పేరుతో రూ.195 ఉన్న పాసు ధరను రూ.450కి పెంచడం దారుణమని పీడీ ఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం శ్యామ్ పేర్కొన్నారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్ ఎదట పీడీ ఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ..చార్జీల పెంపు వెనుక పేద, మధ్య తరగతి కుటుం బాలకు చెందిన విద్యార్థులను చదు వులకు దూరం చేసే కుట్ర దాగి ఉందన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ఓవైపు సజ్జనార్ ప్రచారం చేస్తూ మరోవైపు విచ్చ విడిగా చార్జీలు పెంచడం ఏంటని ప్రశ్నిం చారు. తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి కక్కడ బస్సులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయ కులు గౌతమ్, గణేష్, జ్ఞానేశ్వరి, మానస, మల్లేష్, మమత, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.