Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్ఆర్బీ, టెట్ పరీక్షలు రెండూ ఒకే రోజున నిర్వహించడం సరిగాదనీ, టెట్‌ను వాయిదా వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగం ఆశించే నిరుద్యోగులు ఒక పరీక్షను కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఆర్ఆర్బి అనేది జాతీయ స్థాయి పరీక్ష కాబటి వాయిదా వేయడం కుదరని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్‌ను మరో తేదీన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.