Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిత్వ వికాస నిపుణులు మహీపతి శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు, మహిళలకు శనివారం హైదరాబాద్‌లో స్పోకెన్ ఇంగ్లీష్‌పై ఒకరోజు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఆంగ్ల ఆచార్యులు డాక్టర్ మహీపతి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ శిక్షణలో సులుమైన పద్ధతులను, యుకె రైనా మెళకువలతో ఎలా ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడొచ్చో నేర్పబోతున్నామని వివరించారు. ఈ శిక్షణ హైదరాబాద్‌లోనిని లక్డికాపూల్లో ఉన్న సెంట్ హోటల్లో శనివారం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని తెలి పారు. ఆసక్తి గల అభ్యర్థులు 7989840371 నెంబర్‌ను సంప్రదించా లని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు, విద్యార్థులతోపాటు పోటీపరీక్షల కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు. ఆంగ్లంపై పట్టు సంపాదిస్తే ఉద్యోగావకాశాలు, ఉన్నత విద్యలో రాణించొచ్చని పేర్కొన్నారు.