Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఓపెన్‌కాస్ట్ గనుల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పార్లమెంటు సభ్యులు, రక్షణ సంక్షేమంపై పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సభ్యులు బీ వెంకటేష్ నేత సింగరేణి అధికారులకు సూచించారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ కార్యాలయంలో శుక్రవారంనాడాయన సింగరేణి అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణిలో భూగర్భగనుల కన్నా ఓపెన్‌కాస్ట్ గనుల్లో ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కాంట్రాక్టర్ల వద్ద పనిచేస్తున్న కార్మికులకు రక్షణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనీ, చిన్న చిన్న కారణాలతో వారిని తొలగించొద్దని చెప్పారు. రామగుండం, బెల్లంపల్లి, రీజియన్లలోని 12 ఓపెన్‌కాస్ట్ గనులపై సంబంధిత డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లతో చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద రావు, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మెన్ పుట్టా మధుకర్, సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరామ్, డి.సత్యనారాయణరావు పాల్గొన్నారు.