Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఏఐ, అగ్రి హబ్ భాగస్వామ్యం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యవసాయ సాంకేతిక స్టార్టప్‌ల కోసం తెలంగాణ ఆర్టి ఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), అగ్రి హబ్ మధ్య ఒప్పందం కుది రింది. శుక్రవారం హైదరా బాద్‌లో జరిగిన కార్యక్రమంలో అగ్రి హబ్ డైరెక్టర్ డాక్టర్ కల్పనా శాస్త్రి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు డాక్టర్ వి.ప్రవీణ్ రావు, అగ్రి హబ్ చైర్ పర్సన్ రమాదేవి లంక ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మిషన్ ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ వ్యవసాయ సాంకేతికరంగంలో నూతన ఆవిష్కరణల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇందుకోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోనున్నదని చెప్పారు.