Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలికపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి రిమాండ్
నవతెలంగాణ-హయత్‌నగర్/వనస్థలిపురం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటన మరవకముందే మరో దారుణఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేండ్ల బాలికపై ఓ ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్ప డ్డాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్నగర్లో నివాసం ఉంటున్న సలీమ్ ఆటో డ్రైవర్ మూడు రోజులుగా ఇంటి పక్కనే ఉంటున్న బాలికను షాప్‌కు పంపి సిగరెట్ తెప్పించుకునేవాడు. తర్వాత బాలికకు తాపించి లైంగిక దాడికి పాల్పడేవాడు. అతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు పక్కింటి మహిళకు అనుమానం రావడంతో బాలిక తల్లికి విషయం చెప్పింది. దాంతో బాలికను ఆమె తల్లి అడుగగా మూడు రోజులుగా సలీమ్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది. దాంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని రిమాండ్‌కు తరలించారు. కాగా శుక్రవారం ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ ఎదుట, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి వద్ద స్థానికులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈటల పరామర్శ
లైంగిక దాడికి గురైన బాలికను, కుటుంబ సభ్యులను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వనస్థలిపురం ఏరియా ఆస్పత్రివద్ద స్థానిక నేతలతో కలిసి పరామర్శించారు. రాష్ట్రంలో సీసీ కెమెరాలు, షీ టీమ్స్ ఉన్నా మహిళలపై ఇంకా అఘాయిత్యాలు ఎందుకు ఆగడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.