Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహిళా సాధికారతపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శిం చారు. మహిళలపై ఏ మాత్రం గౌరవమున్నా ఆ ప్రచారాన్ని ఆపాలని ప్రధాని నరేంద్రమోడీ సహా బీజేపీ నేతలకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దిగువ మధ్యతరగతి మహిళలపై అధిక ప్రభావం చూపేటే ధరలను నియంత్రించడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని అన్నారు. కరోనా నుంచి గ్రామాలను రక్షించడంలో అంగన్వాడీలు కీలకపాత్ర పోషించారనీ, అయితే బీజేపీ సర్కార్ వారి బడ్జెట్ను 50 శాతం తగ్గించిందని తెలిపారు.