Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ డైరెక్షన్లోనే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ రాజ్భవన్లో మహిళా దర్బార్ నిర్వహించారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మతవిద్వేషాలతో ఓట్లు రాబట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మతవిద్వేషాలు రెచ్చగొడు తున్నారనీ, అలాంటి వ్యక్తులను ప్రభుత్వం, పోలీసులు ఎందుకు కట్టడి చేయట్లేదు? అని ప్రశ్నించారు. హిందువులు ఆజ్మీర్ దర్గాకు వెళ్లకుండా రాజాసింగ్ అడ్డు కోగలరా? అని సవాల్ విసిరారు. తెలంగాణ రాజకీయాలు ప్రజలను రక్షించేలా లేవన్నారు. శాంతి భద్రతలు కాపాడటం ఎలా అనేది కూడా లేకుండా పోయింది . రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కుట్ర జరుగు తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. కెసిఆర్ మోడీ ఒకరినొకరు తిట్టుకున్నట్టు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.