Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ పంచాయతీ ఎదుట బైటాయించి నిరసన
- డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే వరకు ఆందోళన చేస్తా: సుగుణ
నవతెలంగాణ-బెజ్జంకి
రోడ్డు వెడల్పులో స్వచ్చందంగా తన ఇంటిని కూలగొట్టి ఆదర్శంగా నిలిచిన టీఆర్ఎస్ మహిళా మాజీ మండలాధ్యక్షురాలు పంచాయతీ కార్యాలయం ఎదుట బైటాయించి ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన బెజ్జంకికి చెందిన మాజీ మండలాధ్యక్షురాలు సుగుణ ప్రజాప్రతినిధుల హామీతో ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించే వరకు పంచాయతీ కార్యాలయం దగ్గర నుంచి వెళ్లేది లేదని శుక్రవారం రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీ తన్నీరు శరత్ రావు, సర్పంచ్ రావుల నర్సయ్య, ఎంపీటీసీలు కొండ్ల కవిత, లింగాల లక్ష్మి నరసయ్య, టీఆర్ఎస్ నాయకుల సమక్షంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి రోడ్డు వెడల్పుకు సహకరించాలనే సదుద్దేశంతో తన ఇంటిని కూల్చానని తెలిపారు. నాడు ప్రజాప్రతినిధులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందజేతలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. తలదాచుకోవడానికి ఇల్లు లేక నేడు రోడ్డు పాలయ్యానని వాపోయారు. మాజీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందజేస్తామని ఇచ్చిన హామీని మర్చిపోయారని తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ ఇండ్లలో ఎవ రికీ కేటాయించకుండా వృథాగా ఉన్న 8 ఇండ్లలో ఒకటి తనకు కేటాయిం చాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీఆర్ఎస్ నాయకులు లింగాల లక్ష్మణ్‌కు సూచించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.