Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైపుణ్యాభివృద్ధిపై యువత ప్రత్యేక దృష్టి సారించాలి
- దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది
- తెలంగాణకు మోడీ చేసిదేమీలేదు..
- ఐటీ పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ - మెట్పల్లి
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఉద్యమ ట్యాగ్ లైన్ అమలు చేస్తున్నామని, జీవితంలో మన నైపుణ్యా లను ఎప్పటికప్పుడు పెంచుకోవడంపై యువత ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీ పరిశ్రమలు, పురపా లక శాఖ మంత్రి కేటీఆర్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్ట ర్ ద్వారా జగిత్యాల జిల్లా మెట్పల్లి అంబేద్కర్ స్టేడియంకు చేరుకున్న మంత్రి అక్కడినుంచి గండి హనుమాన్ దేవాలయానికి చేరుకొని పూజలు నిర్వ హించారు. అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తన తల్లి తండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన 56 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని ప్రారంభించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్దిదారులకు అందించా రు. మెట్పల్లి పట్టణంలో యువతకు శిక్షణ అందిం చేందుకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాన్ని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారం భించి స్టడీ మెటీరియల్ అందించారు. అనంతరం పట్టణంలోని వెంకట్ రెడ్డి గార్డెన్స్‌లో విద్యార్థులతో సమావేశమై కేటీఆర్ మాట్లాడారు.
బీజేపీ నాయకులు అబద్దాలను ప్రచారం చేయడం తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. దేశంలో నిరుద్యోగం, తాండవిస్తున్నదని, నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటాయన్నారు. అమిత్ షాని అబద్దాల బాద్షాతో పోల్చారు. బీజేపీ నాయకుల మాటలకు పొంతనవుండదని, ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారన్నారు.
మెట్పల్లి మండలం గ్రామాల్లో యువతకు, రైతులకు ఉపయోగపడేలా ధాత్రి బయో సంస్థ రూ.160కోట్ల పెట్టుబడితో 250మందికి ఉపాధి, భువి బయో సంస్థ రూ.1060 కోట్ల పెట్టుబడితో 2వేల మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. వివి5 అనే ఐటీ సంస్థ కోరుట్ల ప్రాంతంలో 200 మందికి ఉపాధి కల్పిస్తూ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తుందన్నారు. 15ఆగస్టు 2022నాటికి రాష్ట్రంలో కోటి ఇండ్లకు మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. గోదావరి నదిపై బ్రిడ్జ్జి నిర్మించిన బ్రిటీష్ ఇంజినీర్ సర్ ఆర్దర్ కాటన్‌ను ఎలాగయితే స్మరించుకుంటామో.. అలాగే, సీఎం కేసీఆర్ నీటి రంగంలో చేసిన కృషిని దేశం మొత్తం ఏదో ఒకరోజు ప్రశంసిస్తుందన్నారు. దేశంలో భౌగోళికంగా 11వ స్థానం, జనాభాలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణ.. ఆర్థికంగా 4వ స్థానంలో నిలిచిందని ఆర్బీఐ ప్రకటించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనంగా ఐటీ ఎగుమతులు రూ.57000కోట్ల నుంచి రూ.1.83 లక్షల కోట్లుకు 300శాతం పెరిగాయన్నారు. టీఎస్ ఐపాస్ కింద రూ.2.32 లక్షల కోట్ల పెట్టుబడితో 19000 పరిశ్రమల ఏర్పాటు అవుతున్నాయని, వీటి ద్వారా 16లక్షల మంది యువతకు ఉపాధి అవకాశా లు లభిస్తాయని తెలిపారు. 1.31 లక్షల ఉద్యోగు లను ప్రభుత్వ రంగసంస్థల్లో నియమించిం దని, మరో 90వేల ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేస్తుందని వెల్లడించారు. ఖాళీలు స్థానిక యువతకు దక్కేలా సీఎం కేసీఆర్ 95శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నూతన జోనల్ విధానం ఆమోదింపజేసారన్నారు.