Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒత్తిడిని తగ్గించి పనిచేయించండి
- కార్యదర్శి రోనాల్రోస్కు టీఎస్‌యూటీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని గిరిజన సంక్షే మ గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా య ఫెడరేషన్ (టీఎస్ యూటీ ఎఫ్) డిమాండ్ చేసింది. ఉపా ధ్యాయులపై ఒత్తిడి తగ్గించి సుహృద్భావ వాతావరణంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, కోశాధికారి టి లక్ష్మారెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయులు అధిక పనిభారంతో, మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వారికి సంబంధించిన సమస్యలు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అన్ని క్యాడర్ల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అన్ని విద్యాలయాలకూ వెంటనే శాశ్వత భవనాలను నిర్మించాలని పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ మూడు ద్వారా నిర్దేశించిన పాఠశాలల పనివేళలను అమలు చేయాలని సూచించారు. డైట్ ఛార్జీలను ప్రస్తుత ధరలకనుగుణంగా మార్చాలని తెలిపారు. అద్దె భవనాల్లో విద్యార్థులకు సరిపడినన్ని వాష్ రూమ్‌లు, డార్మిటరీలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రతినెలా మొదటితేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వేసవి సెలవుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు ఈఎల్స్ ఇవ్వాలని తెలిపారు. పాలిచ్చే తల్లులకు నైట్‌డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించారు. రాత్రి విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు మరుసటి రోజు ఉదయం ముందుగానే వెళ్లే అవకాశం కల్పించాలని కోరారు.