Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13న ఈడీ కార్యాలయం వద్ద ధర్నా
- రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి
- ప్రభుత్వంలోని వారే లైంగికదాడులకు పాల్పడుతున్నారు : టీపీసీసీచీఫ్ రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. మహిళలు, పిల్లలపై అడుగుడునా లైంగికదాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని పెద్దలే లైంగికదాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై లైంగికదాడి ఘటనపై ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఒక్క మాటైనా మాట్లాడటం లేదని విమర్శించారు. కుటుంబాలకు, మహిళలకు భద్రత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనర్ బాలిక ఘటనపై నోరు మెదపలేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు. అంతకు ముందు పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి నోటీసులు ఇవ్వడానికి నిరసనగా 13న రాష్ట్ర ఈడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని కోరారు. శాంత్రిభద్రతల అంశంపై 15న అన్ని రాజకీయ పార్టీల నేతలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్టు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అధికారాన్ని పంచుకుంటున్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు లైంగికదాడులను పంచుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఎలాంటి నేరాలు, గోరాలు చేసిన శిక్షలు మాఫీ అన్నట్టుగా అసదుద్దీన్ వ్యవహరిస్తున్నాడనీ, మిత్రపక్షమైన ఎంఐఎం నేతలు లైంగికదాడులు చేస్తే ఎందుకు శిక్షించడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలనీ, లేదంటే తామే హైదరాబాద్ బచావో నినాదంతో నగరంలోని శాంతి భద్రతలపై 15న అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ పరిస్థితికి ప్రభావితులైన ప్రజలు కొంత కాలానికి టిఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇస్తారని హెచ్చరించారు. గజ్వేల్ ఫాంహౌసే కేసీఆర్ ప్రపంచమన్నారు. కాంగ్రెస్ లేనప్పుడు...కాంగ్రెస్‌తో పొత్తు కోసం ఎందుకు తాపత్రయ పడుతున్నారని ప్రశ్నించారు. పదిమంది ఎంపీలు లేని టీఆర్ఎస్ కాంగ్రెస్ వద్దంటే అయిపోతుందా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినా పోటీ చేయాల్సింది తెలంగాణలోనే కదా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి కథలు చెబుతారని విమర్శించారు. ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్టీఆర్‌ను గతంలో తిట్టిన కేసీఆరే...ఇప్పుడు పొగుడుతున్నారని చెప్పారు. కేసీఆర్ మాటలు చిత్తు కాగితంతో సమానమన్నారు.కేసీఆర్ అనే కాలం చెల్లిన మెడిసిన్ ఇక పనిచేయదని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఆయా పార్టీ నేతలను కలిసిన ఆయన్ను జోకర్‌గా చూస్తున్నారని చెప్పారు. దేశ రాజకీయాలపై కేసీఆర్‌కు మక్కువ ఉంటే, నెల్లూరు జిల్లాలో జరగబోయే ఉప ఎన్నికలో పోటీ చేస్తారా?అక్కడ అభ్యర్థిని నిలబెట్టి, ప్రచారం చేస్తారా? అని సవాల్ విసిరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన పాత్రను పెద్దది చేసి చూపడానికే కేసీఆర్ జాతీయ పార్టీ నినాదం ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు.