Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ నేత ప్రొఫెసర్ అనిల్ రాజింవాలె
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ జాతీయ సమితి సభ్యులు ప్రొఫెసర్ అనిల్ రాజింవాలె విమర్శించారు. నిరాశావాదులు, నిస్సహాయకులుగా ఉన్న విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించలేదని చెప్పారు. హైదరాబాద్‌లోని మఖ్డూం భవన్లో శనివారం సీపీఐ కేంద్ర పార్టీ పాఠశాల ఆధ్వర్యంలో యువజన క్యాడర్ కోసం ఏడు రోజుల విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వలి ఉల్లాV్‌ా ఖాద్రి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను అనిల్ రాజింవాలె ప్రారంభించి ప్రసంగించారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని నమ్మి విద్యావంతులైన యువకులు బీజేపీకి ఓటు వేశారని చెప్పారు. ఎనిమిదేండ్ల మోడీ పాలనలో ద్యోగావకాశాలనూ కల్పించకుండా నిరుద్యోగ యువతను మోసం చేశారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మోసాల వల్ల నేడు విద్యావంతులైన యువకులు ఉద్యోగాలు రాక, స్విగ్గీ, జొమాటో డెలివరీ పని చేస్తున్నారని అన్నారు. ఓలా లేదా ఉబెర్‌లో డ్రైవింగ్ చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వాల వినాశకరమైన విధానాలు యువత భవిషత్తును దెబ్బతీస్తున్నాయని చెప్పారు. ప్రశ్నిస్తే యువత గొంతును ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయని విమర్శించారు. జాతీయవాదం, దేశభక్తి పేరుతో బీజేపీ యువతను రెచ్చగొట్టి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదని అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.