Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెన్ కృష్ణప్రదీప్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆదివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉచితంగా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెన్ పి కృష్ణప్రదీప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో యూపీఎస్సీ పరీక్షా విధానం, జనరల్ స్టడీస్, న్యూస్‌పేపర్ విశ్లేషణ, ఎన్సీఈఆర్టీ, ఆప్షనల్ ఎంపిక ఎలా చేసుకోవాలి వంటి అంశాలపై సీనియర్ అధ్యాపకులతో సమగ్ర అవగాహన కల్పిస్తామని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని అశోక్‌నగర్‌లో ఉన్న 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి సెమినార్లో నిర్వహించే ఉచిత అవగాహన సదస్సుకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు 040 35052121జ8686233879 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.