Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అసోసియేషన్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సాధారణ బదిలీల ప్రక్రియను చేపట్టాలని హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ను శనివారం హైదరాబాద్‌లో ఆ అసోసియేషన్ అధ్యక్షులు పి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈ నాగరాజు, ఉపాధ్యక్షులు పి అనంత్‌రెడ్డి కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో త్వరలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కాబోతున్నా నేపథ్యంలో ఎక్సైజ్ శాఖలో సాధారణ బదిలీలు చేపట్టాలని చేపట్టాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.