Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు
- అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి :విద్యాశాఖ అధికారులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాతపరీక్ష ఆదివారం జరగనుంది. ఐదేండ్ల తర్వాత రాష్ట్రంలో టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్న 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఉండదు. గంట ముందునుంచే అభ్యర్థులకు కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. సకాలంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అంటే ఉదయం 9.30, మధ్యాహ్నం 2.30 గంటల సమయం దాటితే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతిని నిరాకరిస్తారు. టెట్ పేపర్-1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది కలిపి మొత్తం 6,29,352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పేపర్-1కు 1,480, పేపర్-2కు 1,203 కలిపి మొత్తం 2,683 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓఎంఆర్ పత్రంలో గడులను నింపడానికి నల్ల ఇంకు బాల్‌పాయింట్ పెన్నునే వినియోగించాలి. ఇతర రంగుల పెన్నులతో గడులను నింపితే ఆ ఓఎంఆర్ పత్రాలను పరిగణనలోకి తీసుకోరు. ఓఎంఆర్ పత్రాన్ని మడత పెట్టడం, ముడతలు పడేలా చేయడం, బార్కోడ్ నలిగిపోవడం వంటివి చేయొద్దు.