Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 317 జీవోను రద్దు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. ఉపాధ్యాయుల పోరాటం ద్వారానే జీవోను రద్దు చేయించడం సాధ్యమవుతుందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఓయూ దూరవిద్య కేంద్రంలో టీపీఆర్టీయూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడారు. ఉపాధ్యాయులు ప్రశాంతంగా ఉంటేనే విద్యా బోధన సజావుగా సాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సదరు జీవో ద్వారా టీచర్స్ ఉన్న ఊరికి, కుటుంభానికి దూరమై మనోవేదన అనుభవిస్తున్నారని చెప్పారు. కొందరు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల్లో ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ తగ్గాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా లేకుండా పోయిందని, గృహ నిర్బంధాలు, అరెస్టులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీచర్స్ జీవో వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. హర్షవర్ధన్‌రెడ్డి, హనుమంతరావు, శ్రీకాంత్, వెంకన్న, యాదగిరి, తిరుపతి, సంపత్, ప్రసంగించారు. నాగేశ్వరరావు, విజరు కుమార్, వినోద, హారతి, గిరిజ, దత్తత్రి, విఠల్ పాల్గొనారు.