Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ ఆఫీస్ వద్ద మహిళా కాంగ్రెస్ నేతల బైటాయింపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళలు, మైనర్లపై జరుగుతున్న లైంగికదాడులకు నిరసనగా మహిళా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. శనివారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్ నేతలు బైటాయించారు. వారిని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వరలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనన్నారు. జూబ్లీహిల్ ఘటనలో బాధితురాలు వీడియోను బీజేపీ ఎమ్మెల్యే ఎలా బహిర్గతం చేస్తారని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. ఏదో ఒక ప్రాంతంలో రోజు లైంగికదాడులు జరుగుతూనే ఉన్నా ప్రభుత్వంగానీ పోలీసు యంత్రాంగంగానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. మహిళలు, చిన్నారులపై హత్యలు, దాడులు చేస్తున్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బస్‌పాస్ చార్జీల పెంచడం అన్యాయం :రేవంత్ ట్వీట్
బస్పాస్ఛార్జీలను ఊహించని స్థాయిలో పెంచడం ప్రయాణీకుల పాలిట పిడుగుపాటు అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఆర్టీసీ తీసుకు న్న ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచేలా ఉందని తెలిపారు. ఈ నిర్ణయం మోయలేని భారంతో విద్యార్థులను చదువులకు దూరం చేసేలా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.