Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత పద్ధతిలోనే వెయిటేజీ ఇవ్వాలి
- మంత్రి హరీశ్‌రావుకు టీఎన్ఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగు లకు పాతపద్ధతిలో వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ నర్సింగ్ సమితి (టీఎన్ఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో టీఎన్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కురుమేటి గోవర్థన్ నేతృత్వం లో ప్రతినిధులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. పాత పద్ధతిలో సర్వీస్‌కు అత్యధికంగా 20 మార్కులు, ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి సీనియార్టీ ప్రకారం అత్యధికంగా 10 మార్కులు ఇవ్వడం ద్వారా 30 మార్కులు వెయిటేజీగా వచ్చేవని వారు తెలిపారు. కొత్త పద్ధతిలో కేవలం సర్వీస్ వెయిటేజీ 20 మార్కులు కొనసాగిస్తూ, 10 మార్కులు తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా ప్రభుత్వ పరిధిలో పని చేసే నర్సులతో పాటు నిరుద్యోగులుగా ప్రయివేటులో పని చేసే వారు కూడా 10 మార్కుల వెయిటేజీ కోల్పోయారని చెప్పారు. తద్వారా సీనియర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం గోవర్థన్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి తమ వినతిని పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. పాత పద్ధతిలో 30 శాతం మార్కులు వెయిటేజీ వచ్చేలా ఉత్తర్వులు ఇవ్వకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తామని తెలిపారు.