Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడిపల్లిలో ఘనంగా నూతన స్టోర్‌ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్:కస్టమర్ల నమ్మకమే పునాదిగా.. వారి ఆదరాభిమానాలే సోపానాలుగా ముందుకు సాగితే ఏ వ్యాపార సంస్థ అయినా విజవంతమవు తుందని, దినదినాభివృద్ధి సాధిస్తుందని 'ఉషోదయ సూపర్ మార్కెట్ ' వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ ఎం . యుగంధర్ అన్నారు. శనివారం మ ల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో తమ సంస్థ 22వ స్టోర్..తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామ కూర మల్లారెడ్డి ప్రారంభించారు. యుగంధర్ విలేఖరులతో మాట్లాడుతూ.. 2005వ సంవత్స రంలో హైదరాబాద్ లోని ఏ ఎస్ రావు నగర్ లో తమ ఉషోదయ సూపర్ మార్కెట్ తొలి స్టోర్ ను ఏర్పాటు చేశామనీ, కొద్ది కాలంలోనే కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొని, వారి ఆదరాభిమానాలే సోపానాలుగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందా మన్నారు. తమ నాణ్యత , నమ్మకం.. వాటితో లభి ంచిన కస్టమర్ల ఆదరణతోనే ఈ అభివద్ధి సాధ్య మైందని ఆయన వివరించారు. ప్రస్తుతం నూతనంగా ప్రారంభమైన ఈ స్టోర్..తమ సంస్థ కు 22వ స్టోర్ అని, తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా తమ స్టోర్లు ఉన్నాయనీ, అన్నీ విజ యపథంలో పురోగమిస్తున్నాయని ఆయన తెలి పారు. తమ స్టోర్లలో నిత్యావసర వస్తువుల నుంచి గహౌపకరణాల వరకు అన్నీ లభ్యమవుతాయని , అన్నీ నాణ్యతకు పెట్టిందిపేరని ఆయన అన్నారు . ఉన్నత వ్యాపార విలువలతో కస్టమర్ల అభిమా నాన్ని సొంతం చేసుకుని పురోగమిస్తామని, మరిన్ని స్టోర్లను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ఫీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి , డిప్యూటీ మేయర్ కే . శివ కుమార్ గౌడ్ , కెనరా నగర్ కార్పొరేటర్ రాజేశ్వరి పప్పుల , ముఖ్య అతిథు లుగా విచ్చేశారు. ఉన్నం లా ఫర్మ్ అండ్ అసోసియే ట్స్ సీనియర్ అడ్వకేట్ మురళీధర్ రావు ఉన్నం ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు. స్టోర్ ను ప్రార ంభించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యలు మల్లా రెడ్డి మాట్లాడుతూ.. నాణ్యత , నమ్మకాలకు మారు పేరైన ఉషోదయ సూపర్ మార్కెట్ సంస్థ మరిం త అభివృద్ధి సాధించాలని , ప్రజానీకం ఈ స్టోర్‌లో కొనుగోళ్లు చేసి నాణ్యమైన వస్తువులను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. నూతన స్టోర్ ప్రారంభం సందర్భంగా.. సంస్థ ఎం డీ యుగంధర్ , స్టోర్ సిబ్బందికి ఆయన తన శుభాకాంక్షలు అందజేశారు.