Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుడిసెలను తగలబెట్టడం, మహిళలపై దాడి చేయడం..
- పేదలకు అండగా న్యాయపోరాటం
- ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ (ఐలూ)
నవతెలంగాణ-మట్టెవాడ
సామరస్యంగా కలిసిమెలిసి ఒకేచోట గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న పేద గుడిసెవాసులపై బుల్డోజర్లు ఎక్కించి, మహిళలపై దాడి చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ (ఐలు) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ, మహిళా విభాగం కన్వీనర్ సీహెచ్ శైలజ అన్నారు. వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం జక్కలొద్ది గ్రామంలో పోలీసులు బుల్డోజర్లతో జరిపిన దాడిలో గుడిసెలు కోల్పోయి గాయాలపాలైన గుడిసె వాసులను ఆదివారం ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ బృందం పరామర్శించింది. పోలీసులు జరిపిన దమనకాండకు సంబంధించిన వివరాలను గుడిసెవాసులను అడిగి తెలుసుకున్నారు. గుడిసెవాసుల పోరాటానికి తాము అండగా నిలబడుతూ న్యాయపోరాటం చేస్తామని ధైర్యం చెప్పారు. అనంతరం భూ పోరాట స్థలంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఆరూరి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గుడిసె వాసులను ఉద్దేశించి వారు మాట్లాడారు. నిలువ నీడ కోసం కొన్ని నెలలుగా జక్కలొద్దిలోని ప్రభుత్వ భూమిలో వేల సంఖ్యలో గుడిసెలు వేసుకొని నివసి స్తున్న పేదలపై పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుల్డోజర్లు తొక్కించి గాయపరచడం అన్యాయమన్నారు.
చిన్న పెద్ద, ముసలి, తేడా లేకుండా దాడి చేసి విచక్షణరహితంగా కొడుతూ పేదలు వేసుకున్న గుడిసెలకు నిప్పు పెట్టడం దారుణ మన్నారు. మహిళలని కూడా చూడకుండా దాడి చేసి గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించా లని డిమాండ్ చేశారు. పేదలకు దక్కాల్సిన స్థలం దక్కేవరకు ఆల్ ఇండియా లాయర్ అసోసియేషన్ తరఫున మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసి, న్యాయపోరాటం చేస్తామని స్పష్టంచేశారు. పరామ ర్శించిన వారిలో ఏఐఎల్యూ ఉపాధ్యక్షులు సారంపల్లి మధుసూదన్‌రెడ్డి, వై శ్రీనివాసరావు, రాష్ట్ర కోశాధికారి వేణుగోపాల్‌రావు, సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్.రంగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీశ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రత్నమాల, నాయకులు దుర్గయ్య, ఓదేలు, సాగర్, ప్రశాంత్, సందీప్, చందు పాల్గొన్నారు.