Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెయిటేజీ, సీనియార్టీ, ఎడ్యుకేషన్ మార్కులను ప్రాతిపదికగా తీసుకోవాలి
- మంత్రి హరీశ్ రావుకు టీపీహెచ్డీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు పరీక్షలు పెట్టే ఆలోచన విరమించుకోవాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్డీఏ) కోరింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో టీపీహెచ్డీఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్థన్ నేతృత్వంలో ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎంపీహెచ్ఏ (ఎఫ్), ఎంపీహెచ్ఏ (ఎం), రేడియో గ్రాఫర్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్లకు 20 శాతం వెయిటేజీ, 10 శాతం సీనియార్టీకి, ఎడ్యుకేషన్ మార్కులకు 70 శాతం ప్రాతిపదికగా పర్మినెంట్ చేయాలని కోరారు. అనంతరం జనార్థన్ మాట్లాడుతూ, వైద్యారోగ్య సంఘాల ఐక్యవేదికలో 24 సంఘాల ప్రతినిధులతో ఈ వారంలో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.