Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మృతి
నవతెలంగాణ-చిన్నకోడూరు
కారును లారీ ఢ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామ శివారులో ఆదివారం జరిగింది. చిన్నకోడూరు ఎస్ఐ శివానందం, మల్లారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన దంపతులు తాండ్ర పాపారావు (56, రిటైర్డ్ లెక్చరర్), పద్మ(50) హైదరాబాద్‌కు వెళ్లడానికి గొంటి ఆంజనేయులు(36) కారును కిరాయికి మాట్లాడుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ నుంచి హైదరాబాద్ బయల్దేరిన గంటలోనే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామ శివారులో రాంగ్రూట్లో అతి వేగంగా ఎదురుగా వస్తున్న లారీ కారును ఢ కొట్టింది. దాంతో డ్రైవర్‌తో సహా దంపతులిద్దరూ మృతి చెందారు. మృతురాలి తమ్ముడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.