Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్ శాఖకు హనుమంతరావు కేటాయింపు
- సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ సంచాలకులుగా ఉన్న ఎ.శరత్‌ను సంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీ చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న హనుమంతరావు పంచాయతీరాజ్‌శాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ప్రశాంత్ పాటిల్‌ను సిద్దిపేట కలెక్టర్‌గా బదిలీ చేశారు. నల్లగొండ లోకల్ బాడిస్ అదనపు కలెక్టర్‌గా ఉన్న రాహుల్‌శర్మకు నల్లగొండ కలెక్టర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. జోగులాంబ- గద్వాల జిల్లా (స్థానిక సంస్థలు) అదనపు కలెక్టర్‌గా ఉన్న కోయ శ్రీహర్షకు కలెక్టర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. కుమురం భీం-ఆసిఫాబాద్ (స్థానిక సంస్థలు) అదనపు కలెక్టర్‌గా ఉన్న కర్నాటి వరుణ్‌రెడ్డిని ఉట్నూరు ఐటీడీఏ పీవోగా బదిలీ చేశారు. ఉట్నూరు ఐటీడీఏ పీవోగా ఉన్న అంకిత్‌ను ఏటూరు నాగారం పీవోగా బదిలీ చేశారు. కుమురం భీం-ఆసిఫాబాద్ (స్థానిక సంస్థలు) అదనపు కలెక్టర్‌గా చహత్ బాజ్పారును బదిలీ చేశారు.