Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27న ఫలితాలు : కన్వీనర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సుమారు 90శాతం మంది అభ్యర్థులు హాజరైనట్టు టెట్ కన్వీనర్ తెలిపారు. పరీక్షానంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం నిర్వహించిన పేపర్-1కు 3,51,482 దరఖాస్తులు చేసుకోగా, 3,18,506 (90.62శాతం), పేపర్-2 కోసం 2,77,900 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 2,51,070 (90.35శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. టెట్ ఫలితాలను ఈనెల 27న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ తెలిపారు.