Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
తాను వ్యాపారపరంగా ఎదగడా నికి, రాజకీయంగా రాణించడానికి దోహదపడిన గ్రానైట్ కుటుంబాన్ని జీవితంలో ఎన్నడూ విస్మరిం చబోనని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఏ పదవి లేకుండానే గ్రానైట్ పరిశ్రమకు ఎంతో చేశానని, ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ పరిశ్రమ ను కాపాడుకోవడంలో ముందుంటా నని అన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎ న్నికైన రవిచంద్రను తెలంగాణ గ్రానై ట్ పరిశ్రమ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా సన్మానించారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి తరలివచ్చిన వందలాది మంది గ్రానై ట్ యజమానుల సమక్షంలో ఆయన ను సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీపిరిశెట్టి శంకర్ అధ్యక్షతన జరిగిన సభలో రవిచంద్ర మాట్లాడారు. తనకు రాజ్యసభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడానికి గ్రానైట్ పరి శ్రమ ఎంతో దోహదం చేసిందని, అలా ంటి పరిశ్రమ తనకు కన్నతల్లి వంటిద ని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రానైట్ కుటుంబం నుంచి ఇంత కాలం నేనొ క్కడినే ఎంపీగా ఉన్నానని.. ఇప్పుడు రవిచంద్ర కూడా ఎంపీగా ఎన్నికవడం సంతోషకరమన్నారు. పరిశ్రమకు ఇక మీదట తామిద్దరం అండగా ఉంటా మని అన్నారు. ఖమ్మం జిల్లాకు ఒకే సారి రెండు రాజ్యసభ పదవులు ఇచ్చి న కేసీఆర్‌ను గ్రానైట్ పరిశ్రమ మరొ వద్దని అన్నారు. ఈ సభలో గ్రానైట్ పరిశ్రమల సంఘం ప్రతినిధులు పాటిబండ్ల యుగంధర్, ఉప్పల వెంక టరమణ, గంగుల ప్రదీప్, జిల్లా అశోక్, చక్రధర్ రెడ్డి, శరాబందీ, తుళ్లూ రి కోటేశ్వరరావు, పుసులూరి నరేందర్, తమ్మినేని వెంకట్రావు, ఫణి కుమార్, శ్రీధర్, రవీందర్ రావు పాల్గొన్నారు.