Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మత విద్వేష వ్యాఖ్యలు చేసిన నుపూర్‌శర్మ, నవీన్జిందాల్ను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లో నిరసన తెలిపిన వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చడం చట్టవిరుద్దమని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును అణచివేస్తూ, దాని విలువలను ధ్వంసం చేయడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఈ దురాగతాలను ఖండించాలని కోరారు. మహ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలను నిరసిస్తూ, వారిని అరెస్టు చేయాలని ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. వారి వ్యాఖ్యలను దేశంలో అనేక చోట్ల అన్ని తరగతుల ప్రజలు ఖండిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్‌లో నిరసన ప్రదర్శనలు జరిగాయనిగు ర్తుచేశారు. ఆ నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించిన జావెద్ అహ్మద్ తదితరులపై అల్లర్లకు పాల్పడ్డారని కేసులు బనాయించీ, బుల్డోజర్తో ఆయన ఇంటిని కూల్చివేయటం దుర్మార్గమని తెలిపారు. నిజంగా అల్లర్లకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి గానీ, న్యాయస్థానాలను, చట్టాన్ని పక్కన పెట్టి విధ్వంసం చేయడం దుర్మార్గమని తెలిపారు.