Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహ్వానించిన మంత్రి వేముల
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశానికి దిశానిర్దేశం చేసేది టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు తోట గంగాధర్‌తో పాటు బూరెడి శ్రీనివాస్, నంగి జలందర్, ఈదప నరేష్ తదితరులు సోమవారం మంత్రి ్డ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని అభివద్ది, సంక్షేమం దేశ వ్యాప్తంగా కావాలని అనేక రాష్ట్రాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మహేష్, జెడ్పీటీసీ రవి, శర్మానాయక్, ముచ్కూర్ సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ రాజేశ్వర్, ఉప సర్పంచ్ భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.