Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గౌరవెల్లి-గండిపెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై దాడిని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గుడాటిపల్లిలో గౌరవెల్లి - గండిపెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్ధరాత్రి పోలీసులు ప్రాజెక్టు భూ నిర్వాసితులపై పట్ల అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తించారని తెలిపారు. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులై ఉపాధి కొల్పోయి రోడ్డున పడ్డ వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించడం ఏ మాత్రం క్షమార్హం కాదని వ్యాఖ్యానించారు. నిర్వాసితులను ఆదుకోకుండా ఏండ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం ఎంత వరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్వాకంతో నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులు కోరుతున్న విధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారి పక్షాన న్యాయపరమైన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.