Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్‌ను రద్దుచేయాలి
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ ఉపాధి పథకంలో రాజకీయ జోక్యం తగదనీ, పని గంటలు , హాజరు పరిశీలనలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలని విడుదల చేసిన సర్క్యులర్ 333, దాని మార్గదర్శకాలను రద్దుచేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జి నాగయ్య, ఆర్ వెంకటరాములు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీల పని గంటలు , హాజరు , పని ప్రదేశాల పరిశీలనలో సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ , జడ్పీటీసీ, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ , ఎమ్మెల్యేలను తప్పనిసరి చేసూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ మార్గదర్శకాలు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకేనని విమర్శించారు. నేషనల్ మానిటరింగ్ సిస్టమ్ యాఫ్ ద్వారా గ్రామ కార్యదర్శి ప్రజా ప్రతినిధులను గ్రూప్ ద్వారా కో ఆర్థినేట్ చెయ్యాలనటం హాస్పదంగా ఉందని తెలిపారు. గ్రామ కార్యదర్శులపై, కూలీలపై రాజకీయ నాయకుల ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లను పునర్ నియామకాలు చెయ్యాలనీ, మేట్లు , ఫీల్డ్ అసిస్టెంట్లు కోర్దినేషన్ పనిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.