Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ బ్లడ్ డోనర్ డే (జూన్ 14)ను పురస్కరించుకుని సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రక్తదాతలు సహాయంగా ఇస్తున్న రక్తం ప్రతి ఏడాది మిలియన్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. రక్తదానం ఉన్నతమైనది, మానవీయమైనది, వెలకట్టడానికి వీలులేనిదని ఆమె అభివర్ణించారు. స్వచ్ఛంద రక్తదాతలు ఉదారంగా చేస్తున్న సేవలను గుర్తించేందుకు, వారికి కృతజ్ఞత తెలుపుకునేందుకు డోనర్ డే అనేది ప్రజలకు ఒక అవకాశమని తెలిపారు. క్రమం తప్పకుండా రక్తదానం చేయడాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సంక్లిష్ట ఆరోగ్య సమస్యల సమయంలో రక్తం కొరతతో ఏ ఒక్కరు ప్రాణం కోల్పోవడానికి వీల్లేని పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలోనూ స్వచ్ఛంద రక్తదాతలు తలసేమియా, సికిల్సెల్ రోగాలతో బాధపడుతున్న చిన్నారులను కాపాడేందుకు ముందుకొచ్చారని తమిళిసై కొనియాడారు.