Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''ప్రభుత్వాస్పత్రుల్లో చాలా మంచి వైద్యులున్నారు. తాము కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడి పని చేస్తున్నాం. అద్భుతమైన వైద్య సేవలను మా వైద్యులు అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు చాలా కష్టపడుతున్నారు...'' అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. సోమవారం హైదరాబాద్‌లో ఒక ప్రయివేటు ఆస్పత్రిలో పెట్ స్కాన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ టూరిజంగా మారిన హైదరాబాద్ కు చికిత్స కోసం పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం వస్తున్నారని తెలిపారు. ఆధునాతన చికిత్స కోసం గల్ఫ్, ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో త్వరలో 6 వేలు, వరంగల్‌లో 2 వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో అవయవమార్పిడి కేంద్రం బ్లాక్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు హరీశ్ రావు తెలిపారు.