Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత కంటి చికిత్సా శిబిరంలో సినీ డైరెక్టర్ రాజ్ కందుకూరి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మనిషి మనుగడకు కంటి చూపు ఎంతో ముఖ్యమని సినీ దర్శకుడు, ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి అన్నారు. సోమవారం హైదరాబాద్లో తెలంగాణ సినిమా థియేటర్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి చికిత్సా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణం డాక్టర్ సలహాతీసుకోవాలన్నారు. కంటి చూపు కోల్పోతే..సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ఆస్వాదించలేమని చెప్పారు. సుదర్శన్ థియేటర్ మేనేజింగ్ పాట్నర్ బాలగోవిందరాజు మాట్లాడుతూ సినిమా థియేటర్లలో పనిచేసే కార్మికులు కంటి చూపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యూనియన్ సామాజిక బాధ్యతను నిర్వహించిందని అభినందించారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు కె ఈశ్వర్రావు మాట్లాడుతూ సినిమాథియేటర్లలో పనిచేసే కార్మికులకు రావాల్సిన కనీస వేతనాలు, ఈఎస్ఐ,పీఎఫ్, సాధారణ సెలవులు ఇతర సమస్యలతో పాటు వారి ఆరోగ్య సమస్యలను కూడా సీఐటీయూ ప్రత్యేకంగా గుర్తిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నాగటి మారన్న, రాష్ట్ర అధ్యక్షులు పి మనోహర్ రెడ్డి కార్యదర్శి అరుణ్, ఉపాధ్యక్షులు పి పుల్లారావు, కే సతీష్ ,ఎం సుధాకర్ ప్లానెట్ ఆప్టిక్ ఐ క్లినిక్ డాక్టర్ అనిల్ కుమార్ ,డి సునీల్ , రేఖా, సౌజన్య, సుదర్శన్ 35 ఎంఎం సినిమా ధియేటర్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి , దేవి 70ఎంఎం మేనేజర్ కుమార్, కార్మికులు జాంగిర్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.