Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూటీఎస్ నేతలకు మంత్రి సబిత హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెలాఖరులోగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని పీఆర్టీయూటీఎస్ నేతలకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రిని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులతోపాటు మోడల్ స్కూల్ టీచర్లకూ బదిలీలు, పదోన్నతులు కల్పిస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. వారం రోజుల్లోపే సీనియార్టీ జాబితాలు రూపొందించేలా డీఈవోలకు ఆదేశాలు జారీచేస్తామన్నారని వివరించారు. పరస్పర బదిలీలకు సంబంధించి ఒప్పందపత్రం సమర్పించినవారికి వెంటనే ఉత్తర్వులివ్వాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. సమగ్రశిక్ష ఉద్యోగులందరికీ బదిలీల షెడ్యూల్ ఈ వారంలో విడుదలవుతుందని పేర్కొన్నారు.