Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుపై బైటాయించిన రైతులు
నవతెలంగాణ-రాజంపేట్
జొన్న పంట కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం కొండాపూర్లో రైతులు సోమవారం రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వ సూచన మేరకు కొండాపూర్ గ్రామం పరిసరాల్లో 300 ఎకరాల వరకు జొన్న పంటలు సాగు చేసినట్టు తెలిపారు. కానీ ఇప్పుడు పంట చేతికి వచ్చాక ప్రభుత్వం జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తుండటంతో ఇన్ని రోజులు చేసిన శ్రమ నీటి పాలవుతుందనే భయంతో పలువురు రైతులు తక్కువ ధరకే దళారులకు విక్రయించి నష్టపోయినట్టు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని కోరారు. అనంతరం సాగుపై అవగాహన సదస్సుకు వచ్చిన జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మికి కొనుగోలు కేంద్రంపై రైతులు విన్నవించుకున్నారు.